: కేపీహెచ్ బీలో సైకో సూదిగాడు... యువకుడికి సిరంజీ గుచ్చి పరార్
తెలుగు రాష్ట్రాల్లో పక్షం రోజులుగా కలకలం రేపిన సైకో సూదిగాడి దాడులు నాలుగైదు రోజులుగా తగ్గముఖం పట్టినా, పూర్తిగా ఆగిపోలేదు. ఇందుకు నిదర్శనంగానే కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరో సైకో సూదిగాడి దాడి నమోదైంది. నగరంలోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్ బీ) కాలనీలో సూదిగాడు ప్రత్యక్షమయ్యాడు. ఓ యువకుడిపై సిరంజీ దాడి చేశాడు. బాధిత యువకుడు తేరుకునేలోగానే ఆ సైకో క్షణాల్లో అక్కడినుంచి మాయమయ్యాడు. సిరంజీ దాడికి గురైన బాధితుడు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సైకో కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.