: మద్రాస్ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఐఐటీలో చదువుతున్న నరం నాగేందర్ రెడ్డి అనే తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడని తెలిసింది. ఈ విద్యార్థి స్వస్థలం ఏపీలోని కడప జిల్లాలోని కేశవపురం. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నప్పటికీ పూర్తి విచారణ తరువాత అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకోవానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.