: ఈ ఉద్యోగాల్లో ఉంటే సహోద్యోగులే జీవిత భాగస్వాములు!


ఏదైనా ఒక వృత్తి లేదా ఒక ఉద్యోగం చేస్తున్నవారు అదే వృత్తి, ఉద్యోగంలో ఉన్న వారిని జీవిత భాగస్వాములుగా చేసుకునేందుకు ప్రయత్నిస్తారట. దాదాపు 4 కోట్ల జంటలపై రీసెర్చ్ చేసిన ప్రిక్ ఎకనామిక్స్ అమెరికన్ అనలిస్ట్ డాన్ కోఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యధిక ప్రొఫెషనల్స్ తమ వృత్తిలో ఉన్న వారినే జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారని తెలిపారు. లాయర్లు, టీచర్లు, రైతులు తదితర వర్గాల్లో ఇలా ఒకే రంగంలోని వారు కలుస్తుండగా, గనులు, నిర్మాణ రంగం, ఆర్థిక రంగంలో ఉపాధిని పొందుతున్న వారు, తాము పనిచేస్తున్న విభాగంతో సంబంధమున్న భాగస్వామిని ఎంచుకునేందుకు సిద్ధంగా లేరు. రైతులు, టీచర్లు, లాయర్లు, వైద్యులు, మత్స్యకారులు తదితర విభాగాల్లో జరుగుతున్న 25 శాతం వివాహాలు అదే వృత్తికి చెందిన వారి మధ్య జరుగుతున్నాయని కోఫ్ కనుగొన్నారు. సైన్యంలో పనిచేస్తున్న వారికి తోడు నిలిచేందుకు అత్యధికులు వెనుకంజ వేస్తున్నారని వివరించారు.

  • Loading...

More Telugu News