: జడ్జీలు భయంతో వణికిపోతున్నారు: సీజే హెచ్ఎల్ దత్తు


మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తుల పరిస్థితి రోజురోజుకూ భయంకరంగా మారుతోందని, కొందరు న్యాయవాదుల చర్యల కారణంగా భయంతో పనిచేయాల్సి వస్తోందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళాన్ని కోర్టులో అధికార భాషగా చేయాలంటూ అక్కడి న్యాయవాదులు నిత్యమూ ఆందోళన చేస్తుండటంపై జస్టిస్ అమితవ్ రాయ్ తో కలసి సుప్రీంలో వాదనలు విన్న దత్తు, ఈ పరిస్థితులపై అక్కడి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ తో చర్చించానని, ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉన్న కారణంగా, కొంతకాలం వేచి చూద్దామని అన్నారు. మద్రాసు హైకోర్టులో పరిస్థితిపై సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వివరిస్తూ, కోర్టుల్లో నినాదాలు నిత్యకృత్యమైపోయాయని, న్యాయమూర్తులను రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తమిళాన్ని అధికార భాషగా చేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించిన సీజే, తాము న్యాయవాదులుగా ఉన్న సమయంలో, తమిళ లాయర్ల వద్ద ఎంతో నేర్చుకున్నామని, ఇప్పుడు యువ న్యాయవాదులకు అదే మాట చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News