: దురంతో ఎక్స్ ప్రెస్ లో చోరీ... రూ.15 లక్షలున్న వైద్యుడి సూట్ కేసు అపహరణ
సికింద్రాబాదు-విశాఖ దురంతో ఎక్స్ ప్రెస్ లో రాత్రి భారీ చోరీ జరిగింది. ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడికి చెందిన సూట్ కేసును గుర్తు తెలియని వ్యక్తులు చాకచక్యంగా అపహరించారు. సూట్ కేసులో రూ.15 లక్షల విలువ చేసే బంగారం, నగదు ఉన్నట్లు సమాచారం. ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న వైద్యుడు రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా దొంగలు అందులోకి ప్రవేశించి సూట్ కేసుతో ఉడాయించినట్లు తెలుస్తోంది. నేటి ఉదయం నిద్ర లేచిన వైద్యుడు తన సూట్ కేసు మాయమైన విషయాన్ని గమనించారు. రైలు విశాఖ చేరుకున్న వెంటనే ఆయన అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.