: ఆపరేషన్ థియేటర్ లో పాములు... గుంటూరు దవాఖానాలో నిలిచిన శస్త్ర చికిత్సలు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని వివాదాలు విడిచిపెట్టడం లేదు. మొన్నటికి మొన్న చిన్నారి బాలుడిని ఆ ఆసుపత్రిలో ఎలుకలు పీక్కుతిన్నాయి. ఈ ఘటనతో రాష్ట్ర, దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయ మీడియాలోనూ ఈ ఆసుపత్రిపై కథనాలు వెలువడ్డాయి. ఇక ఎలుకలను పట్టేందుకు బోను పెట్టగా, ఏకంగా ఓ పాము అందులో పడింది. తాజాగా నిన్న ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లోనే ఓ సర్పరాజం నాట్యం చేసింది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆసుపత్రి వైద్యులు ఏకంగా శస్త్ర చికిత్సలను నిలిపివేసి మరీ థియేటర్ ను శుభ్రం చేయించారు.