: ‘చాగంటి’కి పద్మభూషణ్ ఇవ్వండి... ‘పద్మ’ అవార్డుల కోసం ఏపీ జాబితాలో ఇంకా ఎవరెవరంటే...!


ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు నిన్న అవార్డుకు అర్హత ఉన్న పలువురు ప్రముఖుల పేర్లతో కూడిన జాబితాను ఏపీ సర్కారు కేంద్రానికి పంపింది. ఈ జాబితాలో పద్మభూషణ్ అవార్డుకు చాగంటితో పాటు కూచిపూడి నృత్యకారిణి ఆనందా శంకర్ కూడా ఉన్నారు. ఇక పద్మశ్రీ అవార్డుల కోసం ప్రముఖ సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, సినీ గేయ రచయిత వేటూరి, డాక్టర్ చంద్రశేఖర్, గోపాలకృష్ణ గోఖలేలను ఏపీ సర్కారు ప్రతిపాదించింది.

  • Loading...

More Telugu News