: వాట్సప్ వినియోగదారులకు కేంద్రం షాక్!


వాట్సప్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. మొబైల్ లోని వాట్సప్ ద్వారా పంపించే మెసేజ్ లు, మెయిల్స్ ఇతర ఛాటింగ్ వివరాలు మూడు నెలలపాటు డిలీట్ చేయకూడదు. మొబైల్ లేదా పర్సనల్ కంప్యూటర్ ద్వారా జరిపే ప్రతి ఛాట్ కు ఈ నిబంధన వర్తించనుంది. ఇంటర్నెట్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త చట్టం తీసుకువస్తోంది. ఈ చట్టం అమలులోకి వస్తే పర్సనల్ అంటూ ఏదీ ఉండదు. వ్యక్తిగత విషయాలను కూడా ప్రభుత్వంతో పంచుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. 90 రోజుల పాటు మెసేజ్ లను డిలీట్ చేయకుండా ఉంచాలంటే కాస్త కష్టమైన పనేనని వారు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News