: ఎయిరిండియా విమానం రద్దు... శంషాబాద్ లో ప్రయాణికుల ఆందోళన
రెండు రోజుల క్రితం గన్నవరంలో విమాన ప్రయాణికులకు ఎదురైన అనుభవం నేడు శంషాబాద్ విమానాశ్రయంలో 133 మంది ప్రయాణికులకు ఎదురైంది. హైదరాబాదు నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం సాంకేతిక లోపం కారణంగా రద్దయింది. ఎలాంటి ప్రత్యామ్నాయం చేయకుండా విమానాన్ని రద్దు చేయడంపై ప్రయాణికులు అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 133 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎయిరిండియా తీరుపై విమానాశ్రయంలో ఆందోళన చేశారు. కాగా, ఎయిరిండియా విమానాల్లో తరచు సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమానాలను రద్దు చేయడం మామూలైపోయింది. దీంతో ఎయిరిండియా ప్రయాణికుల్లో అసహనం పెరిగిపోతోంది.