: జెరూసలెంలో చిత్రమైన ఆచారం... తమ పాపాలను కోడిపిల్లలకు బదిలీ చేస్తున్న వైనం!
క్రైస్తవులు పవిత్రంగా భావించే జెరూసలెంలో చిత్రమైన ఆచారం రాజ్యమేలుతోంది. యూదుల దేశమైన ఇజ్రాయెల్ లో జెరూసలెంకు ప్రత్యేక స్థానముంది. ఇక్కడ యూదులు ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తారు. వారిలో కూడా కొన్ని మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. కోడిపిల్లను తలపై పెట్టుకుని ప్రార్థనలు చేస్తే, తాము చేసిన పాపాలన్నీ కోడిలోకి వెళ్లిపోతాయని అక్కడి వారి నమ్మకం. ఆ కోడి పిల్లను ఇతరులకు దానం చేస్తారు. మరి కొందరు దానిని వండి తింటారు. యూదుల క్యాలెండర్ లోని పవిత్ర దినం యోం కిప్పర్ సందర్భంగా నేడు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూదులు తలలపై కోళ్లు ఉంచుకుని ప్రార్థనలు నిర్వహించారు.