: నేతాజీ 1948లో బతికే ఉన్నారన్న ఆయన ప్రధాన అనుచరుడు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై అనుమానాలు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. నేతాజీకి సంబంధించిన 64 సీక్రెట్ ఫైళ్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బహిర్గతం చేయడంతో ఒక్కో రహస్యం బట్టబయలవుతోంది. దేశ స్వాతంత్ర్యం కోసం అనుక్షణం తపించిన వ్యక్తి, అజ్ఞాతవాసంలో గడపాల్సిన దుస్థితిపై దేశవాసులు భగ్గుమంటున్నారు. తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందలేదని, ఆ తరువాత ఆయన బతికే ఉన్నారని, 1948లో చైనాలోని మంచూరియా ప్రాంతంలో నేతాజీ ఉన్నారని, ఆయన అత్యంత సన్నిహితుడు దేబ్ నాథ్ దాస్ 1948 ఆగస్టు 8న నిఘా వర్గాలకు తెలిపారు. నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో దేబ్ నాథ్ దాస్ కీలక సభ్యుడిగా వ్యవహరించారు.