: హైదరాబాదులో గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏపీ పోలీస్ సిబ్బంది
హైదరాబాద్ లో జరిగే గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏపీ పోలీసు సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నారు. ఈ మేరకు సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 1761 మంది పోలీసు సిబ్బందిని నిమజ్జనోత్సవానికి కేటాయించారు. ఈ మేరకు ఏపీ శాంతిభద్రతల అదనపు డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు.