: ఏపీలో జలవనరులు పుష్కలంగా ఉన్నాయి: సింగపూర్ సదస్సులో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో సానుకూల అంశాలపై సింగపూర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో జలవనరులు పుష్కలంగా ఉన్నాయని, సుదీర్ఘ కోస్తా తీరం వంటి సహజ వనరులు తమ రాష్ట్ర సొంతమని చెప్పారు. ఏపీను లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇక కార్గో విభాగంలో రాష్ట్రం ప్రస్తుతం రెండో స్ధానంలో ఉందని, మొదటి స్థానానికి చేరడమే తమ లక్ష్యమని వివరించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా 'ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియాస్ స్టడీస్'లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రసంగించారు. రాష్ట్ర విభజన పలు సమస్యలతో పాటు అవకాశాలూ కల్పించిందన్నారు. ఏపీలో ఐరన్ ఓర్, బాక్సైట్ సహా అనేక ఖనిజ నిక్షేపాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇటీవలే కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో చరిత్ర సృష్టించామని బాబు వెల్లడించారు. గత ఏడాదిన్నరగా భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.