: బొగ్గు క్షేత్రాలు కేటాయించింది మన్మోహనే!: దాసరి నారాయణరావు


బొగ్గు కుంభకోణంలో జిందాల్ గ్రూపులకు బొగ్గు క్షేత్రాలు కేటాయించిన కేసులో ఈ రోజు ఢిల్లీ సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేశారు. జిందాల్ కు ఆ క్షేత్రాలు కేటాయించింది అప్పటి ప్రధాని మన్మోహనే అని పేర్కొన్నారు. బొగ్గుగనుల కేటాయింపులపై మన్మోహనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కేటాయింపుల్లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపారు. ఈ స్కాంలో మన్మోహన్ ను కూడా నిందితుడిగా చేర్చాలన్న మధుకోడా డిమాండ్ ను దాసరి కూడా సమర్థించారు.

  • Loading...

More Telugu News