: గ్రేటర్ లో ఇంతవరకు ఒక్క ఓటు కూడా తొలగించలేదు: మంత్రి తలసాని


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంతవరకు ఎవరి ఓట్లను అక్రమంగా తొలగించలేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సక్రమంగా ఉన్న ఎవరి ఓట్లు తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఓట్లు తొలగించినట్టు ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. ప్రతిపక్షాల చౌకబారు రాజకీయాల వల్లే ఇలాంటి పుకార్లు వస్తున్నాయని మండిపడ్డారు. ఓట్లు తొలగించారంటూ ఈసీకి ఫిర్యాదు చేయడం తగదని, సనత్ నగర్ లో 7వేల ఓట్లు పెరిగాయని చెప్పారు. ఈ మేరకు సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఇక అసెంబ్లీ సమావేశాలను విపక్షాలు అడ్డుకోవాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎన్ని రోజులైనా సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

  • Loading...

More Telugu News