: మోదీ తనకు తానే నష్టం చేసుకుంటున్నారు: రాహుల్ గాంధీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విమర్శకులు అందరూ కలసి చేసే నష్టం కంటే... ఆయనకు ఆయన చేసుకునే నష్టమే ఎక్కువని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చిన నరేంద్ర మోదీ వాటిని నెరవేర్చడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. మథురలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మీ నాయకుడిని కాదని... మీ కుటుంబంలో ఒక సభ్యుడినని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.