: బీసీ జాబితా నుంచి శెట్టి బలిజలను తొలగించడంపై టి.ప్రభుత్వానికి నోటీసులు
బీసీ జాబితా నుంచి శెట్టి బలిజలను తొలగించడంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో ఈ సంవత్సరం అడ్మిషన్లు పూర్తయినందున కళింగులకు రిజర్వేషన్లు కల్పించలేమంటూ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో శెట్టి బలిజ సంఘం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దానిని న్యాయస్థానం విచారించగా, అడ్మిషన్లు పూర్తయినందున కళింగులకు రిజర్వేషన్లు కల్పించలేమని టి.ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమైనందున ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. తదుపరి విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది.