: పసికందు ముఖానికి చీమలు, శరీరంపై గాయాలు: ఆసుపత్రికి తరలించిన ఢిల్లీ పోలీసులు


రెండు రోజుల పాప ముఖం చీమలు పట్టి ఉంది. ఇక కన్నుమూస్తుందేమో అనేటట్లు ఉంది. దీనిని గమనించిన ఒక పాదచారి ఈ సమాచారాన్ని పోలీసులకు అందించాడు. అంతే, రెక్కలు కట్టుకుని వాలిపోయారు 20 మంది ఢిల్లీ పోలీసులు. ఈ సంఘటన వివరాలు... గులాబీ రంగు శాలువాలో చుట్టి ఉన్న రెండు రోజుల పాప ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో ఢిల్లీలోని కాల్కాజీ టెంపుల్ బయట ఒక డ్రెయిన్ పక్కన పడుకోబెట్టి ఉంది. అటుగా వెళ్తున్న ఒక పాదచారి ఈ దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఈలోగా, ముఖం నిండా చీమలు పట్టి, శరీరం నిండా చిన్న చిన్న గాయాలతో ఉన్న ఆ పసికందుకు సమీపంలోని గుడి దగ్గర పూలు అమ్ముతున్న ఒక మహిళ ప్రథమ చికిత్స చేసింది. ఇంతలో పోలీసులు అక్కడికి వెళ్లగానే ఆ పసికందును వారికి అప్పగించింది. అక్కడి నుంచి ఏఐఐఎంఎస్ కు పసికందును తరలించి చికిత్స చేయించారు. పాప తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నామని, దీనిలో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించామని, ప్రకటనలు కూడా చేశామని డీసీపీ మణిదీప్ సింగ్ రాంధ్వా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News