: సినిమా రిలీజ్ అయ్యే వరకు టెన్షన్ పోదు: నాగార్జున


'అఖిల్' సినిమా రిలీజ్ అయ్యేవరకు టెన్షన్ పోదని ప్రముఖ నటుడు, అఖిల్ తండ్రి నాగార్జున చెప్పారు. అఖిల్ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడే ఏమీ కాలేదని, సినిమా విడుదలై దాని రిజల్ట్ తెలిసేవరకు టెన్షన్ గానే ఉంటుందని ఆయన అన్నారు. నాగచైతన్యను తెరకు పరిచయం చేసినప్పుడు కూడా ఇలాంటి టెన్షన్ అనుభవించానని చెప్పారు. వినాయక్, సుధాకర్ రెడ్డిల చేతుల్లో పెడితే, అఖిల్ బాధ్యతంతా నితిన్ తీసుకున్నాడని, వాళ్లిద్దరూ సినిమాకు చాలా కష్టపడ్డారని నాగార్జున వివరించారు. అఖిల్ ని వారు సొంత బిడ్డలా చూసుకున్నారని, వారందరికీ థ్యాంక్స్ అని నాగార్జున చెప్పారు. అఖిల్ ను ఆశీర్వదించిన వారందరికీ థ్యాంక్స్, మహేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నారు నాగార్జున. కృష్ణ గారితో 'వారసుడు' సినిమా చేశానని, ఆయన వారసుడు వచ్చి తన వారసుడ్ని ఆహ్వానించడం శుభపరిణామమని నాగార్జున అభిప్రాయపడ్డారు. తమ కుటుంబాన్ని 75 ఏళ్ల నుంచి అభిమానులు ఆదరిస్తూ వచ్చారని, 'మీ ఆనందంలో, మీ ఉత్సాహంలో మా తండ్రిని చూసుకుంటా'నని నాగార్జున అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News