: గడుసు సమాధానాలతో అభిమానులను ఉర్రూతలూగించిన నాగచైతన్య
హైదరాబాదులో జరుగుతున్న 'అఖిల్' ఆడియో వేడుకలో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలతో అభిమానులను ఉర్రూతలూగించాడు. ఆడియో వేడుక ప్రారంభమైన అనంతరం అభిమానుల సందడితో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం హోరెత్తిపోయింది. అఖిల్ ను ఆశీర్వదించేందుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా నాగచైతన్యను యాంకర్ మాట్లాడిస్తూ... 'అఖిల్ మీ సలహాలు తీసుకుంటారా?' అని ప్రశ్నించింది. దీనికి నాగ చైతన్య సమాధానమిస్తూ, 'వాడినే నేను సలహాలు అడుగుతా'నని చెప్పాడు. వాడు చాలా స్టేబుల్డ్ గా, పాజిటివ్ గా, ప్లాన్డ్ గా ఉంటాడని నాగచైతన్య కితాబిచ్చాడు. 'అంటే ఏం సలహాలు అడుగుతారు?' అని యాంకర్ మళ్లీ రెట్టించి అడగగా, 'అదెలా చెబుతాం?' అన్నాడు నాగచైతన్య. 'అంటే కచ్చితంగా అమ్మాయిల గురించే...' అని యాంకర్ అనగా, నాగచైతన్య అందుకుని, 'అమ్మాయిల గురించి అడగాలంటే నాన్నని అడుగుతాము. దానికి వాడినెందుకు, వాడికే తెలీదు' అని చైతన్య తెలిపాడు. దీంతో స్టేడియం కేరింతలతో హోరెత్తిపోయింది.