: సినిమా స్ఫూర్తితో భర్తను హత్య చేయించింది


సినిమాల్లోని ప్రేమ సన్నివేశాలను యువకులు స్ఫూర్తిగా తీసుకుని యువతులకు ప్రేమను వ్యక్తం చేయడం గురించి విన్నాం. కానీ, సినిమాను స్ఫూర్తిగా తీసుకుని కట్టుకున్న భర్తను వదిలించుకోవాలని భావించిందో మహిళ. ఆ వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ కు చెందిన మున్నాసింగ్ అనే వ్యాపారవేత్త, భాగస్వాములతో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇంతలో తన కారు డ్రైవర్ తో తన భార్య సంబంధం పెట్టుకుందని తెలిసి, తన వ్యాపార భాగస్వాములతో సమస్యలు పరిష్కరించుకునేందుకు వారి దగ్గరకు వెళ్లాలని భార్యను ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. ఈ క్రమంలో భర్త వేధింపులు శృతిమించడంతో, డ్రైవర్ తో పథకం వేసిన మున్నాసింగ్ భార్య, ఓ రోజు భర్తకు పూటుగా మద్యం తాగించి, అంతకు ముందే సుపారీకి కుదుర్చుకున్న ఇద్దరితో అతన్ని హత్య చేయించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, మున్నాసింగ్ భార్య, డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం బట్టబయలైంది. హత్యానేరం అంగీకరించిన భార్య ఓ సినిమాలో చూసిన విధంగా ఇలా హత్య చేయించినట్టు తెలిపింది. దీంతో సుపారీ తీసుకుని హత్య చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News