: మంత్రి స్మృతి ఇరానీకి లీగల్ నోటీసులు


రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ పై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు జారీ చేసింది. అమేథిలోని రైతు భూములను ఈ చారిటబుల్ ట్రస్టు లాక్కొందంటూ స్మృతి ఇరానీ గతంలో ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై, ఆ ట్రస్టుపై ఇంతవరకూ ఆమె రెండుసార్లు బహిరంగ ఆరోపణలు చేశారంటూ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆ లీగల్ నోటీసులో పేర్కొంది. అమేథి రైతు హక్కుల కోసం తాను పోరాడతానని, రైతు భూములను లాక్కొన్న రాహుల్ గాంధీని అవసరమైతే కటకటాలపాలు చేస్తానంటూ స్మృతి ఇరానీ గతంలో వ్యాఖ్యానించింది. కాగా, కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసుకు ఆమె స్పందించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News