: మేకిన్ ఇండియాలో రైతులు, కూలీలకు చోటేది?: రాహుల్ ప్రశ్న


ప్రధాని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియాలో రైతులు, కూలీలకు చోటెక్కడుందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఢిల్లీలో నిర్వహించిన కిసాన్ సమ్మాన్ ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు భూమి తల్లిలాంటిదని, అలాంటి భూమిని రైతుల నుంచి తీసుకోవడం దారుణమని అన్నారు. అలాంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రతిఘటిస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీది మేకిన్ ఇండియా కాదని, టేక్ ఇన్ ఇండియా అని, అందుకే భూసేకరణ బిల్లును తీసుకురావాలని ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా భూసేకరణ బిల్లు ప్రవేశపెట్టడం నుంచి వెనక్కి తగ్గడం రైతులు సాధించిన విజయమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News