: మీడియా ఊహాగానాలకు బీసీసీఐ సమాధానం


గత కొంత కాలంగా టీమిండియా వన్డే జట్టుకు కూడా కోహ్లీని కెప్టెన్ గా నియమిస్తారు...ధోనీ కెరీర్ చరమాంకంలో పడినట్టే...జట్టు సభ్యుడిగా కొనసాగే అవకాశం ఉంది... రవి శాస్త్రికి, కోహ్లీకి మధ్య మంచి సమన్వయం ఉంది అంటూ వార్తలతో క్రికెట్ అభిమానుల్లో అనుమాన బీజాలు నాటిన మీడియా సంస్థలకు బీసీసీఐ సరైన సమాధానమిచ్చింది. వన్డే, టీ ట్వింటీ జట్ల కెప్టెన్ గా ధోనీని నియమించింది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు బోర్డులో మద్దతు కరవైన నేపథ్యంలో, అతని వ్యాపార భాగస్వామి ధోనీపై కూడా ప్రభావం ఉంటుందని పలువురు మీడియా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వీటన్నింటినీ కొట్టి వేస్తూ, బీసీసీఐ ధోనీకి పగ్గాలు అప్పగించింది. దీంతో ధోనీకి జట్టులో తిరుగులేదని, వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ధోనీయే టీమిండియా వన్డే, టీట్వంటీ జట్ల కెప్టెన్ అని తేలిపోయింది.

  • Loading...

More Telugu News