: నోయిడాలో కొత్త హంగులతో క్రికెట్ స్టేడియం... రూ.1,300 కోట్లతో స్థలం కొనుగోలు చేసిన ఏటీఎస్ గ్రూప్
దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో మరో కొత్త క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. దాదాపు 50 వేల మంది కూర్చునేందుకు వీలుగా సరికొత్త హంగులతో నూతన స్టేడియాన్ని నిర్మిస్తామని ప్రముఖ రియల్టీ సంస్థ ఏటీఎస్ గ్రూప్ ప్రకటించింది. ఇందుకోసం ఆ సంస్థ నోయిడా పరిధిలో 125 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏటీఎస్ గ్రూపు రూ.1,300 కోట్లు వెచ్చించింది. ఈ స్థలంలో క్రికెట్ స్టేడియంతో పాటు హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు ఏటీఎస్ గ్రూపు ఎండీ గీతంబర్ ఆనంద్ తెలిపారు.