: ప్రజల శక్తిపై ఎంతో నమ్మకముంది: ప్రధాని మోదీ


ప్రజల శక్తిపై తనకెంతో నమ్మకముందని, ప్రజల సలహాలకు ప్రాధాన్యతనిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. మన్ కీ బాత్ ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉన్న ఆకాశవాణికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. చవకగా లభించే ఖద్దర్ దుస్తులను దేశ ప్రజలు ధరించాలని ఆయన కోరారు. పర్యాటక రంగంలో భారత్ కు చాలా అవకాశాలున్నాయని మోదీ అన్నారు. దేశంలో 30 లక్షల మంది తమ గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారని చెప్పారు. స్వచ్ఛ్ భారత్ గురించి కూడా మోదీ ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News