: తెలంగాణలో అన్నదాతలకు గుత్తా జ్వాల, ప్రజ్ఞాన్ ఓజా చేయూత


తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలపై వరుస కథనాలు ప్రచురించడమే కాక రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు విరాళాల సేకరణకు ఇప్పటికే 'ఆంధ్రజ్యోతి' తెలుగు దినపత్రిక నడుం బిగించింది. ఆ పత్రిక పెద్ద ఇప్పటికే మొత్తంలోనే విరాళాలు సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా రైతు కుటుంబాలకు తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అన్నం పెట్టే అన్నదాత అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఈ సందర్భంగా గుత్తా జ్వాల పేర్కొంది. రైతులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని ఆమె పిలుపునిచ్చింది. ఎంపీ కవిత పిలుపు మేరకే తాను రైతులకు చేయూతనందించేందుకు ముందుకు వచ్చానని పేర్కొంది. తమదీ ఓ రైతు కటుంబమేనని చెప్పిన ప్రజ్ఞాన్ ఓజా, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందిస్తానని ప్రకటించాడు.

  • Loading...

More Telugu News