: 9 మంది కబడ్డీ క్రీడాకారుల దుర్మరణం


రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది కబడ్డీ క్రీడాకారులు మృతి చెందిన హృదయవిదారక సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది.మరో ఐదుగురు క్రీడాకారులు గాయాలపాలయ్యారు. ఒక కబడ్డీ మ్యాచ్ లో విజయం సాధించి తిరిగివస్తుండగా సుందర్గఢ్ జిల్లాలోని బరాయి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఏడుగురు క్రీడాకారులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు క్రీడాకారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News