: శ్రీవారి ఆలయంలో అద్భుతం... గర్భగుడిలోకి ప్రవేశించిన రామచిలుక
తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం అద్భుతం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయంలోని గర్భగుడిలోకి ఓ రామ చిలుక ప్రవేశించింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నాటికి ఉత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. నేటి ఉదయం శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మోహినీ అవతారంలో శ్రీవారు రామచిలుక వలే కనిపిస్తుండగా, అదే సమయంలో ఆలయంలోకి నిజమైన రామచిలుక ప్రవేశించింది. దీంతో స్వామివారి లీలల్లో భాగంగానే ఈ అద్భుతం జరిగిందని భక్తులు భావిస్తున్నారు.