: టికెట్టు ఇవ్వకపోతే పార్టీ కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటా: ఆర్జేడీ ఎమ్మెల్యే బెదిరింపు
త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పార్టీ టిక్కెట్టివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయి దినేష్ బెదిరించారు. ఈ నేపథ్యంలో శనివారం నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆర్జేడీ అధిష్ఠానం తనకు కనుక టిక్కెట్టు ఇవ్వని పక్షంలో పార్టీ కార్యాలయంలోనే ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకుంటానని దినేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన భోజ్ పూర్ జిల్లాలోని జగదీష్ పూర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఈ ప్రకటన చేయడానికి కారణం..2010 అసెంబ్లీ ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన భగవాన్ సింగ్ కుష్వాను దినేష్ స్థానం నుంచి బరిలోకి దించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భావిస్తున్నట్లు వార్తలొస్తుండటమే!