: ఇదో రకం పనిష్మెంట్... ఎవరి స్మార్ట్ ఫోన్లు వారే పగులగొట్టాలి!


నిబంధనలను మీరి విధుల్లోకి మొబైల్ ఫోన్లను తీసుకువచ్చిన ట్రైనీలకు థాయ్ లాండ్ నావీ అధికారులు వెరైటీ శిక్షను విధించారు. తామెంతో ఇష్టపడి కొనుక్కున్న స్మార్ట్ ఫోన్లను చేతికి రాళ్లిచ్చి విరగ్గొట్టమని ఆదేశించారు. దీంతో మరోదారి లేక ధాయ్ నౌకాదళంలో కొత్తగా చేరిన వారు తమ తమ సెల్ ఫోన్లను నేలపై పెట్టి రాళ్లు తీసుకుని తమ చేతులతోనే నాశనం చేశారు. దీన్ని మరో సైనికుడు వీడియో తీయగా, ఈ వెరైటీ పనిష్మెంట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. చిన్న తప్పు చేస్తే, ఒక్కసారైనా క్షమించకుండా, ఇలాంటి శిక్ష విధిస్తారా? అని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తే, దీనిపై అక్కడి అధికారులు స్పందించారు. తాము కొన్ని నిబంధనలు పెట్టుకున్నామని, వీటి గురించి ట్రైనీలకు ముందుగానే చెప్పామని, రూల్స్ అతిక్రమిస్తే, శిక్ష ఇలానే వుంటుందని సమాధానం ఇచ్చారు.

  • Loading...

More Telugu News