: పువ్వుల కొరతతో శ్రీకాళహస్తిలో పూజలు నిలిపివేత!


శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి, వాయులింగేశ్వర స్వామి దేవాలయంలో అనూహ్యంగా ఈ ఉదయం రాహుకేతు పూజలు నిలిచిపోయాయి. వాటితో పాటు ఆలయంలో మిగతా పూజలు కూడా జరగడంలేదు. ఆలయంలో పువ్వులు లేకపోవడంవల్లనే ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నేడు శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. పూజలు జరగకపోవడంతో ఆలయం వెలుపల బారులు తీరిన భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. మరోపక్క పూజలకోసం పువ్వులు తీసుకువచ్చేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News