: సూరత్ లో హార్దిక్ పటేల్ అరెస్ట్
గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తూ, నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చిన పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ ను ఈ ఉదయం సూరత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన తలపెట్టిన 'రివర్స్ దండి యాత్ర'ను 'ఏక్తా యాత్ర'గా మార్చి ఈ ఉదయం ర్యాలీగా అహ్మదాబాద్ కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్న హార్దిక్ ను వారచ్చా పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ యాత్రకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. హార్దిక్ తో పాటు మరో 78 మంది ఆందోళనకారులను పోలీసులు నిర్బంధించినట్టు తెలుస్తోంది.