: 'గంగం గణేశా' అంటూ అదరగొడుతున్న బాలయ్య!


వినాయకచవితి సందర్భంగా 'గంగంగంగం గణేశా... గౌరీ తనయా సర్వేశా... హేరంభా విఘ్నవినాశా' అంటూ విడుదలైన బాలకృష్ణ తాజా చిత్రం 'డిక్టేటర్'లోని పాట సామాజిక మాధ్యమాల్లో అలరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని వినాయక మండపాల్లో హల్ చల్ చేస్తోంది. ఫాస్ట్ బీట్ తో వినగానే ఆకట్టుకునే ఈ పాట ఈ సీజన్ నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక డ్యాన్స్ బీట్ గా నిలిచింది. "నమోనమామి వక్రతుండ, నువ్వే మాగుండె నిండా, నువ్వే మా అండా దండా..." అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ స్వరపరచగా, శ్రీవాస్ గానం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News