: ఆ ఎంపీని పార్లమెంట్ నుంచి బయటకు పంపండి: సుబ్రహ్మణ్యస్వామి
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుగతా బోస్ ను పార్లమెంట్ నుంచి బయటకు పంపివేయాలని బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం... స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తైపీ విమాన ప్రమాదంలో మరణించాడని ఆయన ప్రచారం చేయడమే. నేతాజీకి సంబంధించిన కొన్ని ఫైళ్లను పశ్చిమబెంగాల్ లోని మమతాబెనర్జీ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టిన విషయం తెలిసిందే. 1964 వరకు నేతాజీ బతికి ఉన్నట్లు ఆ ఫైళ్ల ద్వారా తెలుస్తోంది. నెహ్రూ ప్రచారాన్ని సుగతా బోస్ బలపరిచారని, అదంతా అసత్యమని తేలిపోయినందున ఆ ఎంపీని తొలగించేందుకు తీర్మానం చేయాలని స్వామి డిమాండ్ చేశారు.