: రమ్య మేజర్.. ఆమె విషయంలో జోక్యం చేసుకోను: ఈలి నాని


తన కుమార్తె రమ్య ప్రేమ వివాహం విషయంలో తానెలాంటి జోక్యం చేసుకోబోనని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని స్పష్టం చేశారు. రమ్య మేజర్ కాబట్టి తన ఇష్టానికి వ్యతిరేకంగా తమ కుటుంబ సభ్యులం ఎవరమూ అడ్డుతగలబోమని ఆయన తెలిపారు. తన కుమార్తె ఇష్టపడిన సందీప్ ను కిడ్నాప్ చేయలేదని నాని అన్నారు. అలాగే రమ్యను ఇంట్లో బంధించామనడం అవాస్తవమన్నారు. సగటు తల్లిదండ్రుల్లాగే తామూ ఆలోచించామని, కుమార్తెకు మెరుగైన భవిష్యత్తును ఇవ్వాలనుకోవడం తప్పుకాదని నాని చెప్పుకొచ్చారు.

రమ్య 2008లో చిలకలూరిపేటకు చెందిన సందీప్ ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే, సందీప్.. తన కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ ఎమ్మెల్యే ఈలి నాని ఫిర్యాదు చేయడంతో వ్యవహారం మీడియాకెక్కింది. ఈ నేపథ్యంలో తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ,నాని కుమార్తె రమ్య గుంటూరు లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించింది.

  • Loading...

More Telugu News