: టీడీపీ, కాంగ్రెస్ లు కలసి పోరాడే పరిస్థితిని కేసీఆర్ కల్పించారు: రేవంత్ రెడ్డి


టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావులపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. భేతాళ మాంత్రికుడు కేవీపీ సూచనల మేరకే ప్రాజెక్టు డిజైన్లను కేసీఆర్ మార్చాలనుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో కమిషన్లు ఎలా వసూలు చేయాలో కేవీపీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదని అన్నారు. ప్రాణహిత-చేవెళ్లకు గతంలో డిజైన్ ఇచ్చిన వ్యాప్కోస్ సంస్థ, ఇప్పుడు ఆ డిజైన్ పనికిరాదని చెప్పడంలో మర్మమేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి, కలసికట్టుగా పోరాడాల్సిన అవసరాన్ని కేసీఆరే కల్పించారని అన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి పేరుతో తెలంగాణకు తొలి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, ప్రాణహిత కోసం పోరాడిన వ్యక్తి చంద్రబాబే అని చెప్పారు.

  • Loading...

More Telugu News