: గంటలో 75 మందికి గుండు గీసేశాడు... గిన్నిస్ లోకి ఎక్కాడు!


క్యాన్సర్ తో మరణించిన తన కస్టమర్ కు నివాళిగా, ఓ బార్బర్ తలపెట్టిన పని, అతనికి గిన్నిస్ రికార్డును తెచ్చిపెట్టింది. ఈ ఘటన బ్రిటన్ లో జరిగింది. స్యామ్ రాన్ అనే బార్బర్, తన కస్టమర్ క్లేర్ ఎల్లిస్ అనే యువతికి నివాళిగా, గుండు చేస్తానని, కావాల్సిన వారు రావాలని ప్రచారం చేశాడు. సరాసరిన 48 సెకన్లలో ఒక్కొక్కరికి గుండు గీస్తూ, గంటలో 75 గుండ్లు పూర్తి చేశాడు. వారిచ్చిన డబ్బును ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందించాడు. విషయం తెలుసుకున్న గిన్నిస్ రికార్డు అధికారులు, సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో, గంటలో అత్యధిక మందికి గుండు గీసిన వ్యక్తిగా రాన్ నిలిచాడు.

  • Loading...

More Telugu News