: యాలాల ఎస్సై రమేశ్ ది ఆత్మహత్యే... తేల్చిచెప్పిన ఉస్మానియా ఫోరెన్సిక్ నివేదిక


నల్లగొండ జిల్లా యాలాల ఎస్సై రమేశ్ ఆత్మహత్య చేసుకున్న కారణంగానే చనిపోయాడని తేలింది. ఈ మేరకు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు రమేశ్ మృతదేహానికి నిర్వహించిన శవపరీక్ష (పోస్టుమార్టం) నివేదిక తేల్చిచెప్పింది. ఉరేసుకున్న కారణంగానే రమేశ్ చనిపోయాడని ఆ నివేదిక వెల్లడించింది. అంతేకాక రమేశ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని కూడా వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే, రమేశ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన నల్లగొండ జిల్లా ఎస్పీని అతడి బంధువులు అడ్డుకున్నారు. రమేశ్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News