: ప్రకాశం జడ్పీ పీఠంపై మళ్లీ ఈదర హరిబాబు... రేపు ప్రమాణ స్వీకారం?


ఏపీలోని ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ఎన్నికలు జరిగి ఇప్పటికే రెండేళ్లు కావస్తున్నా ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఓ కొలిక్కి రాలేదు. జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ ఈదర హరిబాబు గతంలో జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. పదవీ బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే జడ్పీటీసీగా ఆయన ఎన్నిక చెల్లదని ఈదర వ్యతిరేక వర్గం జిల్లా కోర్టును ఆశ్రయించింది. దీనికి ప్రతిగా ఈదర కూడా హైకోర్టును ఆశ్రయించారు. పలు కీలక పరిణామాల నేపథ్యంలో ఈదర హరిబాబు జడ్పీ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం జడ్పీ వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ ఇన్ చార్జీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పట్టువదలని విక్రమార్కుడిలా ఈదర హరిబాబు సుప్రీంకోర్టునూ ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రేపు హరిబాబు మళ్లీ జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై కూర్చునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News