: నా భర్తను పోలీసులే పిలిచి మరీ కాల్చి చంపారు: ఎస్సై రమేశ్ భార్య ఆరోపణ


నల్లగొండ జిల్లా యాలాల ఎస్సై రమేశ్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక మాఫియానే రమేశ్ ను హత్య చేశాయంటూ గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. పలు అనుమానాలున్న ఈ ఘటనపై సీబీఐ చేత విచారణ చేయించాలన్న డిమాండ్ తో గిరిజన సంఘాలు నేడు దేవరకొండ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇక నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా రమేశ్ భార్య పోలీసు అధికారులపైనే ఆరోపణలు గుప్పించారు. తన భర్తను పోలీసు అధికారులు పిలిచి మరీ కాల్చి చంపారని ఆమె ఆరోపించింది. ఇంటిలో ఉన్న తన భర్తకు ఫోన్ చేసిన ఇద్దరు సీఐలు, వెంటనే రావాలని పదే పదే ఆదేశాలు జారీ చేశారన్నారు. వాహనం లేదని తన భర్త చెప్పినా సీఐలు వినిపించుకోలేదని ఆమె ఆరోపించారు. ఉన్నపళంగా వచ్చేయమన్న సీఐల ఆదేశాలతో వెళ్లిన తన భర్త కొద్దిసేపటికే చనిపోయారని కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త మృతి వెనుక సీఐల హస్తం ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News