: పుడుతూనే రికార్డు సృష్టించిన ట్రిపులెట్స్
పుడుతూనే ముగ్గురు పిల్లలు గిన్నిస్ రికార్డులకెక్కారు. సాధారణంగా పుట్టిన పిల్లలు సుమారు రెండున్నర నుంచి మూడు కేజీల బరువు ఉంటారు. అలాంటి ఒక్క బిడ్డకి జన్మనివ్వాలంటేనే తల్లి మరో జన్మెత్తినంత కష్టం భరించాలి. అలాంటిది మూడు కేజీలకు పైగా బరువున్న ముగ్గురు పిల్లలకి ఒకేసారి జన్మనివ్వాలంటే ఎంత కష్టం భరించి ఉండాలి? అలాంటి కష్టాన్ని అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని ఎంజెల్ వుడ్ ప్రాంతానికి చెందిన మిషెల్లీ లీ విన్సన్ అనే మహిళ భరించి, 10.32 కేజీల బరువున్న ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ ముగ్గురినీ 257 రోజులు గర్భంలో దాచుకున్న మిషెల్లీ 2003 జూలై 29న జన్మనిచ్చారు. ఇవాన్ ప్యాట్రిక్ (3.89కేజీలు), ఏడెన్ కోల్ (3.32కేజీలు), లిల్లీ కాత్రేన్ (3.11కేజీలు) ఈ ముగ్గురు అత్యధిక బరువుతో జన్మించిన ట్రిపులెట్స్ అని తాజాగా విడుదలైన 2016 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎడిషన్ లో పేర్కొన్నారు.