: విజయవాడ మెట్రోకు కేంద్రం అంగీకారం తెలిపింది: వెంకయ్యనాయుడు


విజయవాడ మెట్రో రైల్ నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలిపిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అక్కడ 25 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నామని అన్నారు. ఈ నిర్మాణం పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి నిబంధనల ప్రకారం మెట్రోరైల్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేయాలని ఆయన సూచించారు. మెట్రో రైల్ ఏర్పాటు చేయాలంటే పట్టణ, నగర స్థాయి రవాణా నిధిని ఏర్పాటు చేయాలని, సూత్రప్రాయ అంగీకారం తెలిపినందున కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోవాలని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News