: మోదీకి బర్త్ డే గిఫ్ట్ గా ‘రాకెట్’ను అందించిన సైనా నెహ్వాల్


ప్రధాని నరేంద్ర మోదీ నేడు 65వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అత్యంత నిరాడంబరంగా ఆయన తన జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అయితే మోదీ జన్మదినానికి ఓ రోజు ముందుగా ప్రపంచ బ్యాడ్మింటన్ లో సత్తా చాటుతున్న హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ నిన్న ప్రధానిని కలిసింది. ఈ సందర్భంగా ప్రపంచ చాంపియన్ షిప్ లో తనకు రజత పతకాన్ని సాధించి పెట్టిన బ్యాడ్మింటన్ రాకెట్ ను ఆమె మోదీకి అందించింది. మోదీ జన్మదినం సందర్భంగానే తాను ఆయనకు తన రాకెట్ ను అందించానని ఆ తర్వాత ఆమె మీడియాకు చెప్పింది.

  • Loading...

More Telugu News