: బ్యాంకుల్లో డిపాజిట్ల సొమ్ము వెనక్కి తీసుకుంటున్న పటేళ్లు


ప్రధాని అమెరికా పర్యటన దగ్గర పడుతున్న కొద్దీ పటేళ్లు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ లో పటేళ్లను చేర్చాలంటూ హార్దిక్ పటేల్ నేతృత్వంలో పటేళ్లు ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనలో పటేళ్లు ఆయనకు అమెరికాలో నిరసన తెలపాలని నిర్ణయించారు. అంతవరకు పటేళ్లు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తారని, బ్యాంకుల్లోని డబ్బులు వెనక్కి తీసుకుని నిరసన తెలపాలని హార్దిక్ పటేల్ పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో బ్యాంకులలో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లను పటేళ్లు వెనక్కి తీసుకుంటున్నారు. వడ్డీ రాకపోయినంత మాత్రాన తమకు వచ్చే నష్టం లేదని పలువురు పటేళ్లు పేర్కొంటున్నారు. ఆర్థిక దిగ్బంధం సృష్టించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పటేల్ వర్గం భావిస్తోంది.

  • Loading...

More Telugu News