: మిమ్మల్ని కలిసేందుకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా: అఖిల్
నాలుగు రోజుల్లో అభిమానులను కలవనున్నానని అఖిల్ అక్కినేని తెలిపాడు. 'అఖిల్' సినిమా ఆడియో వేడుక ఈ నెల 20న జరగనుంది. ఆడియో వేడుకకు మరో నాలుగు రోజుల సమయం ఉందని, ఆ నాలుగో రోజు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఆరు నెలలుగా తాము పడ్డ కష్టాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని అఖిల్ వెల్లడించాడు. షూటింగ్ విశేషాలు అభిమానులతో పంచుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఇలాంటి సమయంలో తాతయ్యను ఎంతో మిస్ అవుతున్నానని, ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారని తెలిపాడు. '20వ తారీఖున కలుద్దాం' అంటూ అఖిల్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.