: పిట్ట కథ చెప్పిన కేటీఆర్


మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాలలో వాటర్ గ్రిడ్ పనులకు ఈ రోజు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించిన ఆయన... ఒక పిట్టకథ చెప్పారు. ఈ కథ ఏంటో ఆయన మాటల్లోనే.... "ఓ పిల్లవాడు చిన్నప్పటి నుంచే దొంగతనాలకు అలవాటు పడతాడు. పదేళ్లకే జేబులు కొట్టడం ప్రారంభిస్తాడు. పదిహేడేళ్లు వచ్చేసరికి, తాగుడు సహా రకరకాల అలవాట్లకు బానిస అవుతాడు. ఓ రోజు తన కన్నతండ్రి జేబులోంచే డబ్బు కొట్టేయబోతాడు. అది చూసిన కన్నతల్లి వాడిని ఆపుతుంది. దీంతో కోపం వచ్చి తల్లిని రోకలితో కొడతాడు. అడ్డు వచ్చిన తండ్రిని కూడా కొడతాడు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోతారు. ఆ తర్వాత వాడిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెడతారు. జడ్జి మాట్లాడుతూ, నేను ఎన్నో కేసులు చూశా. కన్న తల్లిదండ్రులను చంపిన వాడిని చూడలేదు. నీకు ఎలాంటి శిక్ష విధించాలో నీవే చెప్పు అంటాడు. దీనికి కొడుకు స్పందిస్తూ, సార్ నేను తల్లిదండ్రులు లేని అనాథను. నన్ను వదిలేయండి అని అంటాడు" ఈ కథ చెప్పిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ శైలి కూడా ఇలానే ఉందని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News