: మంటల్లో చిక్కుకున్న 100 మంది పిల్లలను రక్షించిన అధికారులు


చైనాలోని ఫుజియన్ ప్రావిన్స్ లో ఓ షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాల్ లోని పూల దుకాణంలో లేచిన మంటలు క్షణాల్లో ఇతర షాపులకు పాకాయి. పై అంతస్తులో ఉన్న కిండర్ గార్టెన్ స్కూలు వరకు వ్యాపించాయి. ఈ సమయంలో ఆ స్కూలులో సుమారు వంద మంది పిల్లలు చదువుకుంటున్నారు. విషయం తెలుసుకున్న సహాయక బృందాలు యుద్ధప్రాతిపదికన స్పందించి పిల్లలను కాపాడాయి. వెంటనే వారిని వైద్యపరీక్షల నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News