: తాజ్ మహల్ సందర్శన టికెట్ ధర మరింత పెంపు
ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ సందర్శన టికెట్ ధర మరింత పెరగింది. ఇప్పటివరకు టిక్కెట్ ధర భారతీయులకు రూ.10 ఉంటే ఇది రూ.30కి పెరిగింది. విదేశీయులకు రూ.250 నుంచి రూ.750కి పెంచారు. ఈ మేరకు టికెట్ ధరను 200 శాతం పెంచనున్నట్టు భారత పురావస్తు శాఖ ప్రకటించింది. ఆగ్రా డెవలప్ మెంట్ అథారిటీ (ఏడీఏ)కి ట్యాక్సుల రూపంలో ఎక్కువ కట్టాల్సినందువల్లనే టికెట్ రేట్లను పెంచినట్టు పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు 12 సంవత్సరాల తరువాత తాజ్ మహల్ సందర్శన టికెట్ ధర పెరగడం ఇదే తొలిసారి.