: జగన్ కేసులో విచారణకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడికి మినహాయింపు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ ఎండీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కు స్వల్ప ఊరట లభించింది. దిగువ కోర్టులో ఈ కేసులో జరిగే విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆయనకు మినహాయింపు ఇచ్చింది. కాగా ఈ కేసులో తనను నిందితుడిగా సీబీఐ పేర్కొనడాన్ని కొట్టివేయాలని, సీబీఐ కోర్టులో హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టులో శ్రీని పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారించిన ఉన్నత న్యాయస్థానం కోర్టు విచారణకు హాజరుకావల్సిన అవసరంలేదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.